వైఎస్సార్ పిలిచారు...జగన్ పెళ్లికి మాజీ ఎంపీ శివప్రసాద్ ఏం చేశారో తెలుసా?
- వంద వాహనాల్లో జనంతో తిరుపతి నుంచి వివాహానికి
- భూమన కరుణాకరరెడ్డితో సహా హాజరు
- 1996లో ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన వైఎస్
అందుకే కాంగ్రెస్, టీడీపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందినా అప్పటికి సినిమాలంటే మంచి మోజున్న శివప్రసాద్ దానికే పరిమితమయ్యేందుకు ఇష్టపడి తిరస్కరించే వారట. 1996లో చిత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని శివప్రసాద్‌ను వైఎస్సార్ స్వయంగా కోరారు. అయితే ఆ పార్టీ మరో సీనియర్ నేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అడ్డుపడడంతో అది వీలుకాలేదంటారు. అంతలా వైఎస్ కుటుంబంతో శివప్రసాద్‌కు సంబంధాలు ఉండేవి. దీంతో వై.ఎస్.జగన్ పెళ్లికి ఆహ్వానం అందడంతో తిరుపతికి చెందిన భూమన కరుణాకరరెడ్డితో కలిసి దాదాపు వంద వాహనాల్లో జనంతో శివప్రసాద్ పెళ్లికి హాజరై ఆశ్చర్యపరిచారు.