అవినీతిలో ఆరితేరావు కదా.. నిరుద్యోగుల బాధ నీకేం తెలుస్తుందిలే!: విజయసాయిరెడ్డిపై బుద్ధా సెటైర్లు
- ఏపీలో గ్రామ సచివాలయం రగడ
- చంద్రబాబు వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఆగ్రహం
- సాయిరెడ్డి విమర్శలకు బుద్ధా వెంకన్న కౌంటర్
పేపర్ లీక్ కారణంగా ఉద్యోగాలు సంపాదించిన వారికి విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ లీకులతో ధైర్యం చెబుతున్నారని దుయ్యబట్టారు. కానీ ఇలాంటి చర్యలతో విజయసాయిరెడ్డి 18 లక్షల మంది నిరుద్యోగులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి రాజకీయాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డికి నిరుద్యోగుల బాధ తెలియదని విమర్శించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.