తగ్గింపులే తగ్గింపులు... అనేక వస్తువులపై జీఎస్టీ సవరించిన కేంద్రం
- చింతపండుపై జీఎస్టీ ఎత్తివేత
- వెట్ గ్రైండర్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
- దిగుమతి చేసుకునే రక్షణ రంగ ఉత్పత్తులపై 2024 వరకు మినహాయింపు
ఇక, దిగుమతి చేసుకునే రక్షణరంగ ఉత్పత్తులకు 2024 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నామని, భారత్ లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమయ్యే వస్తువులు, సేవలపై జీఎస్టీ మినహాయింపునివ్వాలని నిర్ణయించామని సీతారామన్ వివరించారు. గది రూ.1000 లోపు అద్దె ఉండే హోటళ్లకు పూర్తిగా పన్ను మినహాయింపు, రూ.1000 నుంచి రూ.7500 వరకు అద్దె ఉండే హోటళ్లకు జీఎస్టీ 12 శాతం, రూ.7500 పైబడి అద్దె ఉండే హోటళ్లకు 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్టు మంత్రి తెలిపారు. గోవాలో నేడు జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.