'వాల్మీకి’ సినిమా పేరుతో కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి: కన్నా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వాల్మీకి’ సినిమా పేరుతో కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి: కన్నా

  • వాల్మీకి పేరును వెంటనే మార్చండి
  • టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై నిషేధం సరికాదు
  • పత్రికా స్వేచ్ఛను హరించడం రాజ్యంగ విరుద్ధం
వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన 'వాల్మీకి' చిత్రం ఈనెల 20న విడుదల కాబోతోంది. మరోవైపు ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సినిమాకు వాల్మీకి అని పేరు పెట్టడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. వాల్మీకి చిత్రం పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.

టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై నిషేధం విధించడం సరికాదని... పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలించిందని... గత ప్రభుత్వం కంటే రెండింతలు ఎక్కువగా అప్రజాస్వామిక పాలన చేసే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
Valmiki Movie
Title
Kanna
Tollywood

More Telugu News