'వాల్మీకి' హిట్ కొట్టడం ఖాయమన్న హరీశ్ శంకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వాల్మీకి' హిట్ కొట్టడం ఖాయమన్న హరీశ్ శంకర్

  • వరుణ్ కి ఇది చెప్పుకోదగిన పాత్ర 
  • పూజా హెగ్డే పాత్ర గుర్తుండిపోతుంది 
  • పవన్ కల్యాణ్ గారు ట్రైలర్ నచ్చిందన్నారన్న హరీశ్
అటు యూత్ ను .. ఇటు మాస్ ను అలరించే సినిమాలను తెరకెక్కించడం హరీశ్ శంకర్ ప్రత్యేకత. ఆయన తాజా చిత్రంగా 'వాల్మీకి' రూపొందింది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుండటంతో, ప్రమోషన్ పనులతో ఆయన బిజీగా వున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఐదేళ్ల క్రితం నేను తమిళంలో 'జిగర్తాండ' చూశాను. అప్పట్లో ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఇటీవల మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు బాబీసింహా పాత్రే హీరోగా అనిపించింది. వరుణ్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచన అప్పుడే వచ్చింది. కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో వరుణ్ ఉత్సాహాన్ని చూపించాడు. ఆయన కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుంది.

 ఇక పూజా హెగ్డే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆమె పాత్ర గుర్తుండిపోతుంది. 'డీజే' సినిమాకి .. ఈ సినిమాకి ఆమె నటనలో పరిపక్వత కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ గారు .. ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చిందన్నారు. అక్కడే మేము సగం సక్సెస్ అయ్యాము. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
Harish Shankar

More Telugu News