మోదీ గారూ, మీరు మరెన్నో సంవత్సరాలు సేవలందించాలి: కేసీఆర్ విషెస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ గారూ, మీరు మరెన్నో సంవత్సరాలు సేవలందించాలి: కేసీఆర్ విషెస్

  • ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం
  • మోదీకి ప్రత్యేక సందేశం
  • మోదీకి ఆశీస్సులందించాలంటూ ప్రార్థన
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీని ఆ భగవంతుడు దీవించాలని, దేశానికి మరెన్నో సంవత్సరాల పాటు సేవలు అందించేలా ఆశీర్వదించాలని కేసీఆర్ ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ప్రత్యేక సందేశం పంపించారు. నేడు ప్రధాని మోదీ 69వ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తూ తమ ప్రియతమ నేత వర్ధిల్లాలని కోరుకుంటున్నారు.
KCR
Narendra Modi
Telangana

More Telugu News