బిగ్ బాస్-3: పునర్నవిని కాపాడడం కోసం ఎవరూ చేయని పని చేసిన రాహుల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్-3: పునర్నవిని కాపాడడం కోసం ఎవరూ చేయని పని చేసిన రాహుల్!

  • డైరెక్ట్ నామినేషన్ లో పునర్నవి
  • 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగిన రాహుల్
  • ఆనందంతో హత్తుకున్న పునర్నవి
బిగ్ బాస్ మూడో సీజన్ లో పునర్నవి, రాహుల్ మధ్య గిల్లికజ్జాలు ప్రేక్షకులకు మాంచి మజా అందిస్తున్నాయి. వీరిమధ్య ఉన్న క్లోజ్ నెస్ పలు ఊహాగానాలకు తావిస్తుండడం కూడా వీరి పాప్యులారిటీ పెరిగేందుకు కారణమవుతోంది. తాజా ఎపిసోడ్ లో పునర్నవిని డైరెక్ట్ నామినేషన్ చేయగా, ఆమె సేవ్ అవ్వాలంటే రాహుల్ ఓ సాహసం చేయాలని బిగ్ బాస్ సూచించాడు. రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగితే పునర్నవి ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటుందని చెప్పాడు.

ఈ విషయం పునర్నవి రాహుల్ తో చెప్పగా, రాహుల్ వెంటనే ఓకే చెప్పాడు. చెప్పడమే కాదు, 20 గ్లాసుల జ్యూస్ ను తన సన్నిహితురాలైన పునర్నవి కోసం అలవోకగా తాగేశాడు. చివరి గ్లాస్ పూర్తి చేసి విజయగర్వంతో తన వద్దకు వచ్చిన రాహుల్ ను పునర్నవి గట్టిగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టడం ఈ ఎపిసోడ్ కు హైలైట్ అని చెప్పొచ్చు.
Bigg Boss
Punarnavi
Rahul

More Telugu News