Chandrababu: చంద్రబాబుకు కమీషన్లు, పవన్ కల్యాణ్ లావాదేవీలు బయటపెడతాం: అంబటి రాంబాబు

  • చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్ట్ గా ఉన్న పవన్
  • ఈ వార్త పవన్ కు తెలియకపోతే దేవుడూ కాపాడలేడు
  • వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి
చంద్రబాబునాయుడు తరఫున అద్భుతంగా యాక్టు చేస్తున్న పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కల్యాణ్ అని బయట అనుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘బయటకు వెళ్లి మీ క్యారెక్టర్ గురించి, పద్ధతి గురించి, మీరు మాట్లాడే మాటలు గురించి’ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని పవన్ కు సూచించారు. ‘మీరు చంద్రబాబునాయుడుగారికి పెయిడ్ ఆర్టిస్ట్ గా యాక్టు చేస్తున్నారన్న వార్త మీ చెవులకు చేరకపోతే, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు’ అని, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలని పవన్ కు హితవు పలికారు. చంద్రబాబుకు కమీషన్లు ఇచ్చి ఎక్కువ ధరలకు ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో, బాబును ఎవరైతే పోషించారో అన్న విషయంతో పాటు పవన్ కల్యాణ్ లావాదేవీలు కూడా బయటకు రావాలని, వీటన్నింటిని బయటపెట్టే కార్యక్రమం వైసీపీ చేయబోతోందని అన్నారు.  
Chandrababu
Pawan Kalyan
YSRCP
Ambati

More Telugu News