‘అస్సాం రెజిమెంట్’ పాటకు చిందేసిన అమెరికా-భారత సైన్యాలు.. వీడియో అదరహో అంటున్న నెటిజన్లు!
- అమెరికాలోని వాషింగ్టన్ లో ఘటన
- యుద్ధ అభ్యాస్ విన్యాసాల్లో పాల్గొంటున్న సైనికులు
- ఖాళీ సమయంలో అద్భుతమైన వీడియో చిత్రీకరణ
శిక్షణా సమయం పూర్తయ్యాక అమెరికా-భారత సైనికులు కలిసి అస్సాం రెజిమెంట్ మార్చింగ్ సాంగ్ ‘బద్లూరామ్ కా బంధన్ జమీన్ కే నీచే హై’ను అద్భుతంగా పాడారు. ఈ పాటలు చప్పట్లు కొడుతూ, కాళ్లను లయబద్ధంగా కదలిస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరుదేశాల సైనికులు ఈ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీన్ని మీరూ చూసేయండి.