కలెక్షన్ల విషయంలో టాప్-5లో నిలిచినా... ఓవర్సీస్ 'సాహో' డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం కష్టమే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలెక్షన్ల విషయంలో టాప్-5లో నిలిచినా... ఓవర్సీస్ 'సాహో' డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం కష్టమే!

  • విదేశాల్లో 6 మిలియన్ డాలర్లకు హక్కులు
  • ఇప్పటి వరకూ వచ్చింది 3 మిలియన్ డాలర్లే
  • డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలేనంటున్న విశ్లేషకులు
ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో రెండు వారాల క్రితం విడుదలైన 'సాహో' ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి, టాప్-5 అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచినా, ఓవర్సీస్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగల్చనుందని అంచనా. వాస్తవానికి ఈ సినిమాకు కాస్తంత నెగటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. మరో పెద్ద హీరో సినిమా లేకపోవడం, 'సాహో'కు ప్లస్ పాయింట్ అయింది. దీంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి.

ఇక, విదేశాల్లో మూడు మిలియన్ డాలర్ల మార్క్ ను అధిగమించిన తెలుగు సినిమాలు కేవలం ఐదు. వాటిల్లో మూడు ప్రభాస్ వే, బాహుబలి రెండు భాగాలతో పాటు, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు 3 మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేయగా, ఇప్పుడు సాహో ఆ ఫీట్ ను అందుకుంది. కానీ, ఈ చిత్రాన్ని 6 మిలియన్ డాలర్లకు విదేశీ హక్కులను పొందిన డిస్ట్రిబ్యూటర్లు, మిగతా మూడు మిలియన్లను సాధించడం దాదాపు అసాధ్యమే. సినిమా విడుదలై మూడు వారాలు దాటిపోవడంతో, సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. మరో రెండు వారాల తరువాత చిరంజీవి 'సైరా' వచ్చేస్తుంది. దీంతో 'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం కష్టమే అంటున్నారు మరి!
Sahoo
Prabhas
Overseas
Collections

More Telugu News