వృద్ధుడి తలపై మొలిచిన కొమ్ము.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తలపై మొలిచిన కొమ్మును వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. రాష్ట్రానికి చెందిన శ్యాంలాల్ యాదవ్ (74) అనే వ్యక్తికి గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైంది. ఆ తర్వాత ఆ గాయం పుండుగా మారి క్రమంగా కొమ్ములా పెరగడం ప్రారంభమైంది.

తలపై పెరుగుతున్న కొమ్ముతో తొలుత ఆయన కొంత ఇబ్బంది పడేవారు. జనం కూడా వింతగా చూసేవారు. అయితే క్రమంగా దానిని ఆయన పట్టించుకోవడం మానేశారు. ఆ తర్వాత తలపై పెరుగుతున్న కొమ్మును తనంతట తానుగానే ఆయన కత్తిరించుకునేవారు. కాగా, ఇటీవల ఆయనకు అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు తలపై మొలిచిన కొమ్మును తొలగించారు.
Go Back to Shorts
Madhya Pradesh
doctors
Operation
horn

More Telugu News