ఇప్పటివరకు 22 కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన చాముండి... అందులో 4 కార్లు సింధు కైవసం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పటివరకు 22 కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన చాముండి... అందులో 4 కార్లు సింధు కైవసం

  • వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ నెగ్గిన సింధు
  • బీఎండబ్ల్యూ కారు బహూకరించిన చాముండి
  • నాగ్ చేతుల మీదుగా కారు అందుకున్న సింధు
ప్రపంచ వేదికలపై సత్తా చాటిన భారత క్రీడాకారులకు ఖరీదైన కార్లను కానుకగా ఇవ్వడం హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కు ఓ ఆనవాయితీగా మారింది. తాజాగా ఆయన భారత బ్యాడ్మింటన్ రారాణి పీవీ సింధుకు లేటెస్ట్ మోడల్ బీఎండబ్ల్యూ కారును బహూకరించారు.

ఇటీవలే సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది. దాంతో చాముండి ఆమెకు కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో నాగార్జున చేతుల మీదుగా సింధుకు కారు బహూకరించారు. ఇక, చాముండి ఇప్పటివరకు 22 కార్లు బహుమతిగా ఇచ్చారు. విశేషం ఏంటంటే, ఒక్క సింధూనే వాటిలో 4 కార్లు అందుకుంది. చాముండి అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన ప్రతిసారి సింధుకు కారును గిఫ్ట్ గా ఇచ్చారు.
PV Sindhu
Chamundeswari Nath
BMW

More Telugu News