అమెరికాలో గర్జించిన తుపాకీ.. ఒకరి దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు!
- వాషింగ్టన్ లోని సియాటెల్ లో ఘటన
- రైల్వేస్టేషన్ లో ఓ దుండగుడి కాల్పులు
- ఘటన అనంతరం పరారైన నిందితుడు
ప్రమాద విషయం తెలుసుకున్న అత్యవసర సేవల సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ నిందితుడు నల్లటి మాస్క్ ధరించి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. కాగా, క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.