ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ లోకి దూసుకెళతాం.. పీవోకేను స్వాధీనం చేసుకుంటాం!: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
- కేంద్ర ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి
- ప్రభుత్వం ఆదేశిస్తే పాటించేందుకు ఆర్మీ సిద్ధం
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భారత ఆర్మీ చీఫ్
‘పీవోకేను పాకిస్థాన్ నుంచి స్వాధీనం చేసుకుని భారత్ లో అంతర్భాగం చేయడమే మా తదుపరి అజెండా. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే దేశంలోని వ్యవస్థలు నడుచుకుంటాయి. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే’ అని రావత్ ప్రకటించారు.