Maha Ganapati: లక్డీకపూల్ కి చేరుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతి... 12లోపే నిమజ్జనం!

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువై, 11 రోజుల పాటు భక్తుల పూజలందుకుని, దాదాపు రెండు కోట్ల మంది దర్శించుకున్న శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నిన్న సాయంత్రం 8 గంటల సమయానికే, చుట్టూ ఉన్న షెడ్డును తొలగించిన నిర్వాహకులు, ఆపై రాత్రి 12 గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు.

ఆ తరువాత భారీ క్రేన్ సాయంతో విగ్రహాన్ని పట్టివుంచి, మెటల్ బీమ్స్ కటింగ్ పనులు ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకు విగ్రహాన్ని ప్రత్యేక లారీపైకి ఎక్కించారు. ఆపై భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం లక్డీకపూల్ లోని ఓల్డ్ మీరా థియేటర్ సమీపానికి శోభాయాత్ర చేరుకుంది. ఉదయం 11 గంటలలోపే ఎన్టీఆర్ మార్గ్‌ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గరకు ఖైరతాబాద్ మహా గణపతి చేరుకుంటాడని అధికారులు తెలిపారు. ఆపై గంట వ్యవధిలోనే ప్రత్యేక పూజలు, నిమజ్జనం పూర్తి కానున్నాయి.
Maha Ganapati
Khairatabad
Hyderabad
Immersion

More Telugu News