Donald Trump: రేపు ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఒక్క రాత్రిలోనే ఇరాన్ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టగలమని, ఆ రాత్రి రేపే కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో కూలిపోయిన అమెరికా ఎఫ్-15 విమాన సిబ్బందిలో రెండో వ్యక్తిని విజయవంతంగా రక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్‌ను 'దుష్టశక్తి'గా అభివర్ణించిన ట్రంప్, ఆ దేశ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ గతంలో సోషల్ మీడియాలో చేసిన హెచ్చరికలను పునరుద్ఘాటించారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను 'చారిత్రాత్మకం'గా అభివర్ణించిన ట్రంప్, అమెరికా సైన్యం ఏ ఒక్క అమెరికన్‌ను వెనుక వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 155 విమానాలు పాల్గొన్నాయని, వాటిలో 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నాయని వివరించారు. వేలాది మంది ఇరాన్ సైనికులు గాలిస్తుండగా, వారిని తప్పుదోవ పట్టించేందుకు సైనికుడు వేరే ప్రాంతంలో ఉన్నాడనే భ్రమ కల్పించి ఈ ఆపరేషన్ పూర్తి చేశామన్నారు.
దాదాపు 48 గంటల పాటు ఇరాన్ దళాలకు చిక్కకుండా ఆ 'వీర సైనికుడు' తప్పించుకు తిరిగాడని ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ, రక్తం కారుతున్నా ఆ సైనికుడు కొండచరియలు ఎక్కి తన లొకేషన్‌ను చేరవేశాడని ట్రంప్ చెప్పారు. ఆపరేషన్ అనంతరం వెనుక వదిలేసిన తమ విమానాల్లోని సాంకేతికత ఇరాన్‌కు చిక్కకుండా ఉండేందుకు, వాటిని పూర్తిగా పేల్చివేసినట్టు ట్రంప్ వెల్లడించారు.
అయితే, ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని కొన్ని మీడియా సంస్థలు ముందుగానే లీక్ చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్ వల్ల అమెరికా సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు.
"ఇది చాలా దారుణం. ఈ లీక్‌కు కారణమైన వ్యక్తిని మేం కచ్చితంగా పట్టుకుంటాం. వార్తను ప్రచురించిన మీడియా సంస్థ వద్దకు వెళ్లి, జాతీయ భద్రత దృష్ట్యా సోర్స్‌ను అప్పగించమని కోరతాం, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది" అని ట్రంప్ నేరుగా హెచ్చరించారు.