ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేక వరద సాయం ప్రకటించిన జగన్ ప్రభుత్వం!
- ఉభయ గోదావరి జిల్లాలకు రూ.10 కోట్ల 9 లక్షల 20 వేల కేటాయింపు
- వరదలలో దెబ్బతిన్న ఇళ్ల యజమానులకు రూ.5 వేలు
- ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ఆర్థిక శాఖ
ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గోదావరి వరదల కారణంగా ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.5,000 అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా, మరో రూ. 2,87,45,000ను పశ్చిమ గోదావరి జిల్లాకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను సంబంధిత లబ్ధిదారులకు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.