ఉగ్రవాద సంస్థలతో పాక్ ఐఎస్ఐ కీలక సమావేశం.. ఇండియాలో దాడులకు దిశానిర్దేశం!
- హాజరైన పలు ఉగ్రవాద సంస్థలు
- ఇస్లామాబాద్ లో సమావేశం
- వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్
ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో, ఏ క్షణమైనా భారత్ పై ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐఎస్ఐ నిర్వహించిన సమావేశంపై కీలక వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్, ఈ సమావేశంలో భారత్ పై ఎలా దాడులు చేయాలన్న విషయంపైనే చర్చ జరిగిందని వెల్లడించింది. ఇస్లామాబాద్ లోని ఓ రహస్య ప్రదేశంలో మీటింగ్ జరిగిందని పేర్కొంది.