విక్రమ్ ల్యాండర్ బాగానే వుంది... చెక్కుచెదరలేదంటున్న ఇస్రో వర్గాలు!
- భారతీయులకు ఊరట!
- కాస్త వంగి ఉన్నా దృఢంగానే ఉందంటున్న సైంటిస్టులు!
- కమ్యూనికేషన్ పునరుద్ధరణకు శాస్త్రవేత్తల కృషి
చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోవడం తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపైన 2.1 కిమీ దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ మూగబోయింది. ఏమైందో తెలియక యావత్ దేశంతో పాటు ఇస్రో వర్గాలు తల్లడిల్లిపోయిన సంగతి తెలిసిందే.