74 ఏళ్ల వయసులో పిల్లల్ని కనడం అనైతికం... ఇంకెప్పుడూ ఇలా చేయబోమని ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ క్షమాపణలు!
- ఐవీఎఫ్ ద్వారా కవలల్ని కన్న మంగాయమ్మ
- దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలు
- అనైతికమేనని అంగీకరించిన ఐఎఫ్ఎస్
ఇది పూర్తిగా అనైతిక చర్యని, నిబంధనలను దుర్వినియోగపరిచారని, అంత పెద్ద వయసులో గర్భం దాల్చడం వల్ల అనర్థాలే అధికమని వెల్లడించాయి. ఏ విధానంలో అయినా 50 సంవత్సరాలు దాటితే, మహిళ గర్భం నుంచి పిల్లల్ని పుట్టించడం సరైన విధానం కాదని, ఈ వయసులో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులకు అవకాశం అధికమని తెలిపిన ఐఎఫ్ఎస్, ఐవీఎఫ్, సరోగసీ విధానాల్లో చట్టాలు సరిగ్గాలేనందునే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది.