100 రోజులు పూర్తిచేసుకున్న సీఎం జగన్.. తీవ్ర విమర్శలు గుప్పించిన గల్లా జయదేవ్!
- నేటితో వైసీపీ సర్కారుకు 100 రోజులు పూర్తి
- ఏపీలో పాలన విధ్వంసం దిశగా సాగుతోందన్న గల్లా
- జగన్ సర్కారుకు దార్శనికత లేదని విమర్శ
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తొలి 100 రోజుల్లో మిగతా ఐదేళ్ల పాటు చేపట్టబోయే అభివృద్ధి కోసం అజెండాను నిర్దేశించుకుంటుందని గల్లా జయదేవ్ తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని ముందుకు కాకుండా తిరోగమనం దిశగా తీసుకెళుతోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం ఏమాత్రం దార్శనికత లేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు.