నడిరోడ్డుపై ఆగిపోయిన జీపు.. కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓనర్!
- గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
- టిక్ టాక్ లో వీడియో వైరల్
- యజమాని, స్నేహితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
రాజ్ కోట్ లో ఇంద్రజిత్ కు ఆటోమొబైల్ షాపుతో పాటు పలు పార్లర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతను వెళుతున్న జీపు రోడ్డుపై ఆగిపోవడంతో సహనం కోల్పోయిన ఇంద్రజిత్ దానికి నిప్పంటించాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిందితులను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఇంద్రజిత్ తో పాటు వీడియోను షూట్ చేసిన అతని స్నేహితుడు నిమిష్ ను అరెస్ట్ చేశారు. కాగా, గణేశుడి ఊరేగింపు కోసం స్నేహితులు ఈ జీపును అడిగారనీ, అయితే వాహనం ట్రబుల్ ఇవ్వడంతో తన పరువు పోయిందని భావించిన ఇంద్రజిత్ జీపుకు మంటపెట్టాడని పోలీసులు తెలిపారు.