బాక్సాఫీసు వద్ద మూడో రోజు కూడా 'సాహో' జోరు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాక్సాఫీసు వద్ద మూడో రోజు కూడా 'సాహో' జోరు!

  • ఆగస్టు 30న రిలీజైన 'సాహో'
  • తొలిరోజే రూ.100 కోట్ల మైలురాయి దాటిన చిత్రం
  • మిక్స్ డ్ టాక్ తో కూడా కలెక్షన్లు కొల్లగొడుతున్న ప్రభాస్ మూవీ
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన యాక్షన్ హంగామా 'సాహో' చిత్రం మిక్స్ డ్ టాక్ తో సైతం కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తొలిరోజున ఓవర్సీస్ ప్రీమియర్స్ కలుపుకుని రూ.130 కోట్ల వరకు వసూలు చేసిన 'సాహో', రెండో రోజు కూడా అదే ఊపు కనబర్చడంతో రూ.200 కోట్ల ఫిగర్ ఈజీగా దాటేసింది. ఫెస్టివల్ సీజన్ కావడంతో మూడో రోజు సైతం కలెక్షన్లలో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. అన్ని సెంటర్లలో కలిపి రూ.94 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Saaho
Prabhas

More Telugu News