117 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్... టీమిండియాకు 299 పరుగుల ఆధిక్యం

కింగ్ స్టన్ లోని సబీనా పార్క్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. విండీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే పరిమితం చేయడం ద్వారా 299 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసింది. అయితే, విండీస్ ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా, కెప్టెన్ కోహ్లీ రిస్క్ తీసుకోకుండా తామే సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 4 పరుగులు చేసి రోచ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ కు తోడుగా పుజారా ఆడుతున్నాడు. ఆటకు నేడు మూడో రోజు కావడంతో రేపటిలోగా ఫలితం తేలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే తొలి టెస్టు నెగ్గి ముందంజ వేసింది.

Go Back to Shorts
India
West Indies

More Telugu News