'సాహో' మీది.... అవాస్తవాలను ప్రచారం చేయొద్దు, పైరసీని ప్రోత్సహించకండి: అభిమానులకు శద్ధా కపూర్ విజ్ఞప్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' మీది.... అవాస్తవాలను ప్రచారం చేయొద్దు, పైరసీని ప్రోత్సహించకండి: అభిమానులకు శద్ధా కపూర్ విజ్ఞప్తి

  • ప్రపంచవ్యాప్తంగా నేడు సాహో విడుదల
  • తమ కష్టాన్ని ప్రేక్షకుల ముందుంచామన్న హీరోయిన్ శ్రద్ధా కపూర్
  • 'సాహో' చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలంటూ సూచన
'సాహో' చిత్రం రిలీజ్ నేపథ్యంలో సినీ ప్రేమికులకు, ప్రభాస్ ఫ్యాన్స్ కు హీరోయిన్ శ్రద్ధా కపూర్ సందేశం వెలువరించారు. 'సాహో' చిత్రం కోసం తాము రెండేళ్లకు పైగా సమయం వెచ్చించి తీవ్రంగా కష్టపడ్డామని, ఇప్పుడు తమ కష్టాన్ని ప్రేక్షకుల ముందు ఉంచామని తెలిపారు. "ఇప్పుడు 'సాహో' మీది. దయచేసి అసత్య ప్రచారం చేయొద్దు, పైరసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దు" అంటూ విజ్ఞప్తి చేశారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని, ఎన్ని కష్టాలు ఎదురైనా అభిమానుల ఆదరణతో అన్నింటిని అధిగమించామని శ్రద్ధ వివరించారు. 'సాహో' చిత్రాన్ని థియేటర్లలోనే చూడండి అంటూ స్పష్టం చేశారు.
Saaho
Prabhas
Sradha

More Telugu News