'జబర్దస్త్' పారితోషికాల గురించి ఫిల్మ్ నగర్ టాక్
- 'జబర్దస్త్' కామెడీ షోకి మంచి క్రేజ్
- ఈ షో ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్లు
- అతితక్కువ పారితోషికమే నెలకి డెబ్భై ఐదువేలు
ఈ నేపథ్యంలో 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా కార్యక్రమంలో కనిపించేవారికి అందే పారితోషికాల వివరాలను తెలిపే లిస్టు ఒకటి బయటికి వచ్చింది. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న నాగబాబుకి నెలకి 20 లక్షలు .. రోజాకి 15 లక్షలు పారితోషికంగా ముడుతున్నాయట. ఇక యాంకర్స్ గా అనసూయ నెలకి 4 లక్షలు తీసుకుంటుంటే, రష్మీ నెలకి 3 లక్షలు అందుకుంటుందని అంటున్నారు. స్కిట్లు చేసేవారిలో సుడిగాలి సుధీర్ .. చమ్మక్ చంద్రకి నెలకి 4 లక్షలు, హైపర్ ఆది - గెటప్ శీను నెలకి 3 లక్షలు పారితోషికంగా అందుకుంటున్నారట. మిగతా వాళ్ల పారితోషికాలు వాళ్ల స్థాయికి తగినట్టుగానే ఉంటాయట. తక్కువ పారితోషికం అంటే నెలకి డెబ్భై అయిదు వేలు" అని చెప్పుకుంటున్నారు.