సీబీఐ, ఈడీ నా పరువు తీస్తున్నాయి: సుప్రీం కోర్టుకు తెలిపిన చిదంబరం
- సుప్రీం కోర్టులో చిదంబరం బెయిల్ పిటిషన్ పై విచారణ
- పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం
- తన ఆవేదన వెలిబుచ్చిన కేంద్ర మాజీ మంత్రి
"సీబీఐ, ఈడీ రోజువారీ పద్ధతిలో నా పరువు తీస్తున్నాయి. ఎవర్నయినా అరెస్ట్ చేస్తే ప్రజలు అతడ్ని దోషిగానే భావిస్తారు. అలాంటి పరిస్థితులు ఓ మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇప్పుడు సీబీఐ, ఈడీ కూడా అదే పని చేస్తున్నాయి. వాటి నుంచి నన్ను నేను కాపాడుకునే ఎలాంటి తరుణోపాయం నావద్ద లేదు" అంటూ తన సందేశంలో చిదంబరం పేర్కొన్నారు. కాగా, చిదంబరానికి ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీని సీబీఐ న్యాయస్థానం పొడిగించింది.