విసా రెడ్డి గారూ... ప్రయోజనాలన్నీ ఒక సామాజిక వర్గానికేనా?: బుద్ధా వెంకన్న

టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎంవో, సలహాదారులు, నామినేటెడ్ పదవులన్నీ రెడ్లకే ఇచ్చేశారని, విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్ పదవులను కూడా రెడ్లతోనే నింపేశారని బుద్ధా ఆరోపించారు. ఆఖరికి జైలు నుంచి పెరోల్ పై విడుదలయ్యే ఖైదీలు కూడా రెడ్లేనని సెటైర్ వేశారు. ఇదంతా కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఇస్తున్న ప్రయోజనాలు కావా? అంటూ ప్రశ్నించారు. హైలీ రెస్పెక్టెడ్ విసా రెడ్డి గారు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Buddha Venkanna
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News