వెస్టిండీస్ 222 ఆలౌట్... టీమిండియాకు 75 పరుగుల ఆధిక్యం

ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ కు 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 297 పరుగులు చేయగా, విండీస్ 222 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్ ఇషాంత్ శర్మ 5 వికెట్లతో విండీస్ వెన్ను విరిచాడు. ఇషాంత్ క్రాస్ సీమ్ బౌలింగ్ కు కరీబియన్ బ్యాట్స్ మన్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.

ఇషాంత్ కు తోడు షమీ, జడేజా కూడా చెరో 2 వికెట్లతో రాణించడంతో విండీస్ తక్కువ స్కోరుకు పరిమితమైంది. ఆ జట్టులో రోస్టన్ చేజ్ 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హోల్డర్ 39, హెట్మెయర్ 35 పరుగులు సాధించారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.
Go Back to Shorts
India
West Indies
Cricket

More Telugu News