దొంగబ్బాయి జగన్, 420 తాతయ్య సాయిరెడ్డి జైలుకెళ్లడం ఖాయం!: బుద్ధా వెంకన్న
- చిదంబరం అరెస్టుపై రగడ
- దుమ్మెత్తిపోసుకుంటున్న వైసీపీ-టీడీపీ
- వైఎస్ పై విమర్శలు చేసిన బుద్ధా వెంకన్న
దిగమింగే నేత(వైఎస్ రాజశేఖరరెడ్డి) చరిత్ర రాష్ట్రం దాటి జాతీయ స్థాయికి చేరిందని బుద్ధా వెంకన్న విమర్శించారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు, ఆయనతో కూర్చున్న వారంతా జైలుకెళ్లడం యాదృచ్ఛికం కాదని వ్యాఖ్యానించారు. అంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ మహిమేనని ఎద్దేవా చేశారు. దొంగ పత్రిక, ఛానల్ నడిపే దొంగబ్బాయి జగన్, 420 తాతయ్య విజయసాయిరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. వీరిద్దరిని జైలు రావాలి.. కావాలి అంటోందని ఎద్దేవా చేశారు. అందుకు సిద్ధంగా ఉండాలని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.