చిదంబరం మేధావి...ఆయనకు ఇలా జరగడాన్ని నమ్మలేకపోతున్నా: బీజేపీ ఎంపీ సత్యపాల్‌సింగ్
- చట్టం, న్యాయం గురించి తెలిసిన వ్యక్తికే ఇలా కావడం ఆశ్చర్యకరం
- కోర్టు ఆదేశించిన వెంటనే ఆయన లొంగిపోవాల్సింది
- దీనివల్ల ఆయన ప్రతిష్ట ఇనుమడించేది
దేశ రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన వ్యక్తి చిదంబరం అని, ఆయన చాలా తెలివైన వారని అన్నారు. చట్టం, న్యాయంపై పూర్తి అవగాహన ఉన్న ఆయన కోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే లొంగిపోయి ఉంటే ఆయన ప్రతిష్ట ఎంతో ఇనుమడించేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆయనకు ఎంతమాత్రం మంచిది కాదని తాను భావిస్తున్నానని అన్నారు.