సాహో-టీడీపీ కాంట్రవర్సీపై స్పందించిన హీరో ప్రభాస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాహో-టీడీపీ కాంట్రవర్సీపై స్పందించిన హీరో ప్రభాస్!

  • జగన్ కు మద్దతుగా ప్రభాస్ వ్యాఖ్యలు
  • టీడీపీ సాహోపై నెగటివ్ ప్రచారం చేస్తోందని పుకార్లు
  • తాజా వివాదంపై స్పందించిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇటీవల టీడీపీ-వైసీపీ కాంట్రావర్సీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. యువ ముఖ్యమంత్రి జగన్ బాగా పనిచేస్తున్నారనీ, ఆయన హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు ప్రభాస్ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు.. దీంతో ప్రభాస్ సినిమా ‘సాహో’కు వ్యతిరేకంగా టీడీపీ మద్దతుదారులు క్యాంపెయిన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. వీటిని ఆ పార్టీ నేత నారా లోకేశ్ ఖండించారు కూడా. తాజాగా ఈ వివాదంపై ప్రభాస్ నోరు విప్పాడు.

ఓ బాలీవుడ్  మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ..‘నేను చాలా స్పష్టంగా మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పాను. ఆ వ్యాఖ్యలు వీడియోలో క్లారిటీగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందో నాకయితే అర్ధం కావట్లేదు’ అని తెలిపాడు. అలాగే రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ..‘మా పెదనాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఆయనతో కలిసి నేను చాలా ఊర్లు తిరిగాను. రాజకీయాల్లో నేను కంఫర్ట్ గా ఉండలేను. రాజకీయాల్లో కొనసాగడం నావల్ల కాదు’ అని ప్రభాస్ చెప్పాడు.
Sahoo
Prabhas
Tollywood
Andhra Pradesh
Telangana
Controversy
Response

More Telugu News