విజయవాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు.. వాహనాలకు నిప్పంటించి పరారీ!
- కాలి బూడిదైన ఓ కారు, రెండు బైకులు
- నిన్న అర్ధరాత్రి దాటాక సత్యనారాయణపురంలో ఘటన
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
బాటిల్ లో తీసుకొచ్చిన పెట్రోల్ ను ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలపై పోసి నిప్పంటించారు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటనలో కారుతో పాటు రెండు బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహన యజమానుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.