చిదంబరం వ్యక్తిత్వ హననానికి కేంద్రం కుట్ర చేస్తోంది!: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం
- చిదంబరం అరెస్టుకు సీబీఐ ప్రయత్నాలు
- అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ నేత
- బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్ గాంధీ
చిదంబరం వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకోసం వెన్నెముకలేని మీడియాను వాడుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ తరహాలో అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు చిదంబరం తాజాగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలుచేశారు. దీన్ని విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ ముందస్తు అరెస్టు బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ, ఈ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ కు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు.