ప్రియుడిపై కోపంతో అతని ఇంటికి నిప్పుపెట్టిన ప్రియురాలు!

20-08-2019 Tue 15:53 | International
  • అమెరికాలోని న్యూజెర్సీలో ఘటన
  • అర్ధరాత్రి ఇంటికి రమ్మని పిలిచిన యువకుడు
  • యువతి రాగా తలుపు తీయని వైనం
ఇంటికి రావాల్సిందిగా ప్రియురాలిని ఆహ్వానించిన యువకుడు తలుపులు తీయకుండా నిద్రపోయాడు. దీంతో చాలాసేపు అక్కడే నిలబడ్డ యువతి, చివరికి సహనం కోల్పోయింది.  పెట్రోల్ తీసుకొచ్చి ఇంటిపై పోసి నిప్పంటించింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. న్యూజెర్సీలోని వుడ్ బరీలో ఓ యువకుడు, తైజా రస్సెల్(29) అనే యువతికి పరిచయముంది. ఈ క్రమంలో ఇంటికి రావాలనీ, ఇద్దరం ఎంజాయ్ చేద్దామని సోమవారం అర్ధరాత్రి దాటాక యువకుడు రస్సెల్ కు ఫోన్ చేశాడు. దీంతో ఆమె ఆశగా ఇంటికి చేరుకుంది.

కానీ అప్పటికే పూటుగా మద్యం సేవించిన యువకుడు నిద్రలోకి జారుకున్నాడు. ఇంటి దగ్గరకు వచ్చిన రస్సెల్ 8 సార్లు ఫోన్ చేసింది. రెండు సార్లు సందేశాలు పంపింది. అయినా యువకుడు గుర్రుపెట్టి నిద్రపోయాడు. దీంతో సహనం కోల్పోయిన రస్సెల్ దగ్గర్లోని ఓ పెట్రోల్ బంక్ కు వెళ్లింది. ఓ బాటిల్ నిండా పెట్రోల్ తో పాటు అగ్గిపెట్టె, లైటర్ ను కొనుగోలు చేసింది. అనంతరం యువకుడి ఇంటిపై చల్లి, నిప్పు పెట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైంది.

అయితే మంటల వేడికి ఉదయం 4.30 గంటల సమయంలో మేలుకున్న యువకుడు కిటికీని పగులగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా అతనికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో యువకుడి ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా, అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోని శునకాన్ని కాపాడారు. మరోవైపు యువతి రస్సెల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

USAWoman sets fireafter he invited herover for late-night S*xthen fell asleepnewzersyPoliceTaija Russell

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more