శోభన్ బాబుగారు చెప్పారు .. కానీ నేను అంతగా ఆలోచించలేదు: జయసుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శోభన్ బాబుగారు చెప్పారు .. కానీ నేను అంతగా ఆలోచించలేదు: జయసుధ

  • శోభన్ బాబుగారు కలుపుగోలుగా వుండేవారు 
  • డబ్బు జాగ్రత్త చేయడంలో ఆయన తరువాతే 
  • ఆయనకి ముందుచూపు ఎక్కువన్న జయసుధ  
తాజా ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ, శోభన్ బాబు గురించి ప్రస్తావించారు. "శోభన్ బాబు గారు సెట్లో అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవారు. సంపాదించిన డబ్బును ఎలా జాగ్రత్త చేసుకోవాలనేది ఆయన అందరితోనూ చెబుతుండేవారు. శోభన్ బాబుగారికి ముందుచూపు చాలా ఎక్కువ. అయితే ముందుచూపుతో ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకునేంతగా నేను ఆలోచించలేదు.

చెన్నై సిటీకి చాలా దూరంగా ఒక ప్రాంతం ఉండేది. సిటీలోని గార్బేజ్ అంతా ఆ ప్రాంతంలోని ఒక ప్రదేశంలో డంప్ చేసేవారు. అలాంటి ప్రాంతంలో శోభన్ బాబు ఇల్లు కట్టుకున్నారు. మరో మూడు నాలుగు ఇళ్లు తప్ప అక్కడ ఏమీ ఉండేవి కావు. భవిష్యత్తులో ఆ డంపింగ్ అక్కడి నుంచి మారిపోతుంది .. ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది .. స్థలాలు కొనుక్కోండి' అని శోభన్ బాబు గారు మాకు చెప్పారు. 'ఈయన ఇక్కడ కొనుక్కోమంటారేంటి' అని మేము అనుకున్నాము. అది ఈ రోజున నెంబర్ వన్ ప్లేస్ .. అదే 'అన్నా నగర్' అని జయసుధ చెప్పుకొచ్చారు.
jayasudha
Sobhan Babu

More Telugu News