'సాహో' .. 'ఓహో' అనిపించాలని ఆశిస్తున్నాను: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' .. 'ఓహో' అనిపించాలని ఆశిస్తున్నాను: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఈశ్వర్' సినిమా నుంచి ప్రభాస్ తెలుసు 
  • ప్రభాస్ ఎంతో ఎదిగిపోయాడు 
  • డిటెక్టివ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో ప్రభాస్ ను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "సినీ దిగ్గజాల సమక్షంలో 'సాహో' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ ను చూసిన తరువాత నాకు ఆయన గురించి మాట్లాడాలనిపించింది. 'ఈశ్వర్' సినిమా చేసే సమయంలో ప్రభాస్ చిన్న కుర్రాడిలా ఉండేవాడు. అలాంటి ప్రభాస్ ను మాకు .. దర్శకుడు జయంత్ సి పరాన్జీకి కృష్ణంరాజుగారు అప్పగించారు.

అలాంటి ఈశ్వర్ .. ఈ రోజున ఆ ఈశ్వరుడు వుండే హిమాలయమంతా ఎత్తుకు ఎదిగాడు. అందుకు నాకు చాలా ఆనందంగా వుంది. మొదటి నుంచీ కూడా డిటెక్టివ్ కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. 'సాహో' కూడా ఒక డిటెక్టివ్ స్టోరీనే అని తెలుస్తోంది. ఒక డిటెక్టివ్ కథపై ఇన్ని వందల కోట్లు పెట్టడం నిజంగా సాహసమే. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకును ముట్టుకుంటే తెలిసిపోతుంది. అలాగే 'సాహో' ఎలా ఉంటుందనేది ట్రైలర్ చెప్పేస్తోంది. 'సాహో' .. 'ఓహో' అనిపించేలా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ప్రభాస్ తో పాటు యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
Prabhas
Paruchuri

More Telugu News