శంకర్ మూవీలో మరోసారి ఛాన్స్ కొట్టేసిన స్టార్ కమెడియన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంకర్ మూవీలో మరోసారి ఛాన్స్ కొట్టేసిన స్టార్ కమెడియన్

  • భారీ చిత్రంగా 'భారతీయుడు 2'
  • కమల్ సరసన నాయికగా కాజల్ 
  • ముఖ్య పాత్రల్లో సిద్ధార్థ్ - ఐశ్వర్య రాజేశ్  
'భారతీయుడు 2' సినిమా షూటింగ్ ఆ మధ్య కొన్ని కారణాల వలన ఆగిపోయింది. మళ్లీ రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. కమల్ సరసన నాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ .. ఐశ్వర్య రాజేశ్ ను ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్నారు.

మరో ముఖ్యమైన పాత్ర కోసం వివేక్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ స్నేహితుడిగా, 'శివాజీ' చిత్రంలో రజనీ స్నేహితుడిగా వివేక్ పోషించిన పాత్రలు ఆయనకి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి. ఇప్పుడు 'భారతీయుడు 2' కోసం మరోసారి శంకర్ ఆయనను తీసుకోవడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను విడుదల చేయనున్నారు.
Kamal
kajal
Vivek

More Telugu News