కాంగ్రెస్ నేత చిదంబరానికి ఈడీ సమన్లు

  • యూపీఏ హయాంలోని విమానయాన కుంభకోణం కేసు
  • విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు
  • ఈ నెల 23న విచారించనున్న అధికారులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 23న హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొంది. యూపీఏ హయాంలో విమానయాన కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ను ఈడీ ఇప్పటికే విచారించింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ ఎదుట చిదంబరం హాజరుకానుండటం గమనార్హం. కాగా, ఎయిర్ సెల్ మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ ఇండియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ విచారణను చిదంబరం ఎదుర్కోన్నారు.
Go Back to Shorts
congress
chidambaram
UPA
Airforce
scam

More Telugu News