గవర్నర్ ను ప్రత్యేకంగా కలిసి జగన్ సర్కారుపై ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నేతలు

  • డ్రోన్ ఎగురవేయడంపై ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలని వినతి
  • నాలుగు పేజీల మెమొరాండం అందజేత
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన తెలుగుదేశం పార్టీ నేతలు, తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి నివాసంపై డ్రోన్‌ ఎగురవేయడంపై ఫిర్యాదు చేశారు. బిశ్వభూషణ్‌ ను రాజ్‌ భవన్‌ లో కలిసిన పార్టీ నేతలు కేశినేని నాని, అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్ తదితరులు నాలుగు పేజీల లేఖను అందించారు. డ్రోన్ ఎగురవేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు భద్రతను తగ్గించిన జగన్ ప్రభుత్వం, హైకోర్టు కల్పించుకున్న తరువాతే తిరిగి పునరుద్ధరించిందని గుర్తు చేశారు. వైసీపీ రాజకీయ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాగా, అంతకుముందు కృష్ణానది వరదతో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది.
Go Back to Shorts
Andhra Pradesh
Governer
Bishwabhushan
Telugudesam

More Telugu News