తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Telangana RTC Strike Enters Second Day
  • 32 డిమాండ్లతో 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులు
  • బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • హైదరాబాద్‌లో సర్వీసులు పెంచిన మెట్రో రైలు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. 32 డిమాండ్లతో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సర్వీసులను పెంచింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను తీసుకుని నడుపుతోంది. హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్‌లలో డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు.

బస్సులు డిపో నుంచి బయటకు రాకుండా కార్మికులు బైఠాయిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం తెలియక కొందరు ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చి, విషయం తెలిసి వెనక్కి వెళుతున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన బస్సులు నడుస్తున్నాయి.
Go Back to Shorts
RTC Strike
Telangana RTC Strike
RTC Workers Strike
Telangana Buses
Hyderabad Metro
MGBS

More Telugu News