ప్రస్తుతం ఏపీలో సిమెంట్ బస్తా కన్నా ఇసుక బస్తా ధర అధికంగా ఉంది!: టీడీపీ నేత ఆలపాటి రాజా
- 73 రోజుల్లో జగన్ ఏం చేశారో చెప్పాలి
- జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి కుంటుపడింది
- గుంటూరులో మీడియాతో టీడీపీ నేత
ప్రస్తుతం ఏపీలో సిమెంట్ బస్తా కన్నా ఇసుక బస్తా ధర అధికంగా ఉందని ఆలపాటి రాజా విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండగా, ఇప్పుడు విద్యుత్ కోతలు నెలకొన్నాయని దుయ్యబట్టారు. జగన్ పాలన కారణంగా ఏపీ అంతర్జాతీయ స్థాయిలో తలదించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకురాబోతున్న గ్రామ వాలంటీర్ వ్యవస్థ కారణంగా అవినీతి రాజ్యమేలుతుందని రాజా హెచ్చరించారు. జగన్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.