బ్రియాన్ లారా రికార్డును అధిగమించిన గేల్

క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును విండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అధిగమించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తరపున ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. క్వీన్స్ పార్క్ లో నిన్న భారత్ తో జరిగిన వన్డేలో గేల్ ఈ రికార్డును సాధించాడు. వన్డేల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఘనత ఇప్పటి వరకు బ్రియాన్ లారా (10,405) పేరిట ఉంది. నిన్నటి మ్యాచ్ లో 11 పరుగులకే గేల్ వెనుదిరిగినప్పటికీ... 10,408 పరుగులతో లారాను రెండో స్థానంలోకి నెట్టేశాడు. అంతేకాదు, నిన్నటి మ్యచ్ తో గేల్ 300వ వన్డేను ఆడాడు. ఈ క్రమంలో లారా (299 వన్డేలు) మరో రికార్డును కూడా అధిగమించాడు.
Go Back to Shorts
Chris Gayle
Brian Lara
West Indies

More Telugu News