కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది!: బ్రిటన్ లేబర్ పార్టీ అధినేత జెరిమీ కోర్బిన్
- కశ్మీర్ పరిస్థితులు కలవరపరస్తున్నాయి
- మానవహక్కుల ఉల్లంఘన ఆమోదనీయం కాదు
- ట్విట్టర్ లో స్పందించిన బ్రిటన్ ప్రతిపక్ష నేత
‘జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అక్కడే మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఇది ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. కశ్మీరీ ప్రజల హక్కులను గౌరవించాల్సిందే. జమ్మూకశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అమలుచేయాలి’ అని కోర్బిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.