మా చేత బీఫ్, పోర్క్ డెలివరీ చేయిస్తున్నారు.. జొమాటో ఉద్యోగుల ఆందోళన!
- పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో ఘటన
- తమ డిమాండ్లను కంపెనీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం
- చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర మంత్రి బెనర్జీ
కాగా, ఈ విషయమై పశ్చిమబెంగాల్ మంత్రి రజిబ్ బెనర్జీ స్పందించారు. ‘తమ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పే అధికారం ఏ సంస్థకూ లేదు. ఇది చాలా తప్పు. జొమాటో ఉద్యోగుల ఆందోళన విషయం నా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. ఇటీవల ఓ ముస్లిం డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకోవడానికి ఓ ఆకతాయి నిరాకరించాడు. ముస్లిం డెలివరీ బాయ్ నుంచి తాను ఆహారం తీసుకోననీ, తనకు హిందువును పంపాలని కోరాడు. దీంతో ఆహారానికి మతానికి సంబంధం లేదనీ, ఆహారమే ఓ మతమని జొమాటో దీటుగా జవాబిచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజా ఆందోళన రేగడం గమనార్హం.