మైదానంలో కుండపోత వర్షం... నిలిచిపోయిన టీమిండియా-వెస్టిండీస్ వన్డే మ్యాచ్

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ప్రావిడెన్స్ లో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్ కు ముందు కూడా వర్షం పడడంతో టాస్ ఆలస్యం కాగా, పోరును 43 ఓవర్లకు కుదించి టాస్ వేశారు. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య విండీస్ 5.4 ఓవర్లలో 9 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రిస్ గేల్ 3, ఎవిన్ లూయిస్ 4 పరుగులు చేశారు. ఈ దశలో భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దాంతో మ్యాచ్ నిలిచిపోగా, గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని కవర్లతో కప్పేశారు.

India
Rain
West Indies

More Telugu News