రవితేజ అభిమానుల టెన్షన్ అదే!

  • వీఐ ఆనంద్ నుంచి 'డిస్కోరాజా'
  • జయం రవి హీరోగా వస్తోన్న 'కోమాలి'
  • ఒకే తరహా కథ అంటూ జరుగుతోన్న ప్రచారం
రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. ఈ సినిమాలో చాలాకాలం పాటు కోమాలో వుండి బయటికి వచ్చిన వ్యక్తిగా రవితేజ కనిపిస్తాడట. తను కోమాలోకి వెళ్లక ముందున్న పరిస్థితులు వేరు .. బయటికి వచ్చిన తరువాత పరిస్థితులు వేరు. కొత్తగా వచ్చిన మార్పులకు అడ్జెస్ట్ కాలేక రవితేజ పడే ఇబ్బందులతో ఈ కథ సాగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, దాదాపు ఇదే తరహా కథతోనే తమిళంలో జయం రవి హీరోగా 'కోమాలి' నిర్మితమైంది. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. దాంతో రవితేజ సినిమా కాన్సెప్ట్ లోని కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతారేమోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Go Back to Shorts
Raviteja
jayam Ravi
kajal

More Telugu News