కశ్మీర్ లోయలో టెన్షన్ లన్నీ పక్కనబెట్టి వాలీబాల్ తో సేదదీరిన ధోనీ!
Add ap7am to your home Screen

కశ్మీర్ లోయలో టెన్షన్ లన్నీ పక్కనబెట్టి వాలీబాల్ తో సేదదీరిన ధోనీ!

  • సైనిక విధుల కోసం కశ్మీర్ వెళ్లిన ధోనీ
  • సాధారణ సైనికుడిలా సేవలు
  • బెటాలియన్ తో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఆడిన వైనం
టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ స్టయిలే వేరు! అందుకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినా, తన మనసుకు నచ్చిన విధంగా ఆర్మీలో విధులు నిర్వర్తించేందుకు కశ్మీర్ లోయలో అడుగుపెట్టి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు ధోనీ. ధోనీ విధుల్లో చేరిన కొన్నిరోజుల్లోనే కశ్మీర్ లో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి.

ఉగ్రదాడుల కలకలం రేగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో, మరెవరైనా అయితే క్రికెట్ ఆడుకుంటే చాల్లే అనుకుని కశ్మీర్ నుంచి తిరిగొచ్చేస్తారేమో కానీ, అక్కడున్నది ధోనీ కదా! అందుకే టెన్షన్లన్నీ పక్కనబెట్టి హాయిగా తన బెటాలియన్ తో కలిసి వాలీబాల్ ఆడుకుంటూ సేదదీరాడు. డ్యూటీ ముగిసిన తర్వాత తీరిక సమయంలో మైదానంలో ఇతర సైనికులతో కలిసి ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
MS Dhoni
Jammu And Kashmir

More Telugu News