పోలవరం ప్రాజక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలకు వరద సమయంలో నోటిసులిస్తారా?: చంద్రబాబు

  • నవయుగ సంస్థకు సర్కారు నోటీసులు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ప్రభుత్వ దూరదృష్టి ఏపాటిదో అర్థమవుతోందంటూ ట్వీట్
ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో పోలవరం ప్రాజక్టుకు వరద పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే, వరద సమయంలో ప్రాజక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలను వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం నోటీసులు పంపడం సరికాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రాజక్టు పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థమవుతోందని విమర్శించారు. అంతకుముందు, పోలవరం ప్రాజక్టు నుంచి విరమించుకోవాలంటూ ఏపీ సర్కారు నవయుగ ఇంజినీరింగ్ సంస్థకు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. నవయుగ సంస్థ ఇప్పటికే బందరు పోర్టు నిర్మాణ భాగస్వామ్యం నుంచి కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Chandrababu
Navayuga
Andhra Pradesh
Polavaram

More Telugu News