నాకు మద్యం అలవాటు లేదు... అది ఫేక్ ఆడియో: తలసాని
Add ap7am to your home Screen

నాకు మద్యం అలవాటు లేదు... అది ఫేక్ ఆడియో: తలసాని

  • బోనాల్లో చిందేసిన తెలంగాణ మంత్రి
  • మద్యం మత్తులో డ్యాన్స్ చేశారంటూ ప్రచారం!
  • ఆడియో మార్ఫింగ్ చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసిన తలసాని
ఇటీవలే బోనాల వేడుక సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సాహంతో డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తాను మద్యం మత్తులో డ్యాన్స్ చేశానంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తలసాని మండిపడ్డారు. తనకు మద్యం అలవాటు లేదని, ప్రతి ఏడాది బోనాలకు డ్యాన్స్ చేస్తానని స్పష్టం చేశారు. ఆడియోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. తలసాని తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్స్ చేయగా, 'మందుబాబులం మేము మందుబాబులం' అనే పాటకు డ్యాన్స్ చేసినట్టుగా ఓ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది.
Talasani
Telangana
Bonalu
Dance

More Telugu News